![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద ప్రసారమయ్యే షోస్ లో... వాళ్ళు చేసే నటన కావొచ్చు డాన్స్ కావొచ్చు, స్కిట్స్ కావొచ్చు అవే కనిపిస్తాయి. ఇదంతా ఆన్ స్క్రీన్.. కానీ ఆఫ్ స్క్రీన్ లో వీళ్లంతా చేసే అల్లరి పీక్స్ లో ఉంటుంది. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు, ఆట పట్టించుకుంటారు. సాధారణంగా ఆఫ్ స్క్రీన్స్ అనేవి పెద్దగా బయటపెట్టరు..కానీ కొన్ని సందర్భాల్లో రేటింగ్స్ కోసమో, నటీనటులు హైప్ అవడం కోసమో వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అలాంటి ఆఫ్ స్క్రీన్ ఇన్సిడెంట్ ఒకదాన్ని పోస్ట్ చేశారు.
అదే సూపర్ జోడి షోలో శ్రీసత్య, యాష్మి మధ్య జరిగిన ఇన్సిడెంట్. మంచి ఫన్ క్రియేట్ చేసింది. ఇది చూస్తే చిన్నప్పుడు చేసిన ఎవరి అల్లరి వారికి గుర్తొస్తుంది. యాష్మి సైలెంట్ గా తన సీట్ లో కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సైడ్ నుంచి శ్రీ సత్య చేతిలో ప్లాస్టిక్ బల్లిని పట్టుకుని వచ్చి ఏమీ తెలియని అమాయకురాలిలా యాష్మి పక్కన కూర్చుని ఆమె నెత్తి మీద ఈ బల్లిని పడేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు యాష్మి పక్కన చూస్తుండేసరికి యాష్మికి అర్థంకాక ఆమె కూడా చూడడం స్టార్ట్ చేసింది. తర్వాత చేతి మీద ఏదో పడినట్టు అనిపించి ఒక్కసారిగా విదిలించి కిందపడేసి కాలి కిందేసి తొక్కేసి శ్రీసత్యను దబీదబీ బాధేసింది.
చంపేస్తావా ఏంటి అని అరిచింది. ఇలా చిన్నప్పుడు ప్రతీ ఒక్కరూ స్కూల్ ఏజ్ లో చేసిన ప్లాస్టిక్ బల్లి ఆటను ఆఫ్ స్క్రీన్ లో శ్రీ సత్య యాష్మితో ఆడింది. ఈ వీడియోని జీ తెలుగు వాళ్ళు పోస్ట్ చేశారు "ఇక్కడ బల్లి అంటే ఎవరికీ భయమో కింద కామెంట్స్ లో చెప్పండి" అని టాగ్ పెట్టారు. ఇక నెటిజన్స్ కూడా "నైస్ బల్లి...ఎక్కడ ఉందా అని వెతుకుతున్నావ్ చూడు....వామ్మో యాష్మి అక్కా భయపడకుండా తొక్కి పడేస్తోంది...ఇంకా ముకుందా క్యారెక్టర్ లోనే ఉన్నట్టుంది...సీరియల్ లో ముకుందా కూడా అస్సలు భయపడదు..శ్రీసత్య సూపర్...చంపేసావా బల్లిని నువ్వు చంపేస్తావ్ నాకు తెలుసు...యాష్మి రియాక్షన్ సూపర్ ఫన్నీగా ఉంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |